ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య
కృష్ణా: మచిలీపట్నంలో వెంకన్న (42) అనే వ్యక్తి శనివారం ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మద్యానికి బానిసై ఆరోగ్యం చెడిపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డారని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడు వివాహం జరిగిన సంవత్సరంలోనే భార్య విడాకులు తీసుకోవడంతో కొన్ని సంవత్సరాల నుంచి ఒంటరిగా ఉంటున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.