గవర్నర్‌తో బీజేపీ ఎంపీ డీకే అరుణ భేటీ

గవర్నర్‌తో బీజేపీ ఎంపీ డీకే అరుణ భేటీ

TG: హైదరాబాద్‌ లోక్‌భవన్‌లో గవర్నర్ శివప్రతాప్‌ శుక్లాను మహబూబ్‌నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ కలిశారు. 'మహబూబ్‌నగర్‌ ఖేల్ సంసద్ మహోత్సవ్‌'కు గవర్నర్‌ను ఆమె ఆహ్వానించారు. ఎంపీ అరుణ విజ్ఞప్తికి గవర్నర్ సానుకూలంగా స్పందించారు. ఈనెల 9 నుంచి 24 వరకు నిర్వహించే క్రీడా మహోత్సవ వివరాలను ఆమె గవర్నర్‌కు వివరించినట్లు సమాచారం.