నల్గొండ జిల్లాలో సర్కార్ కాలేజీలు డీలా..!

నల్గొండ జిల్లాలో సర్కార్ కాలేజీలు డీలా..!

NLG: జిల్లాలో ఇంటర్ ఫలితాల్లో సర్కారు జూనియర్ కాలేజీలు డీలాపడ్డాయి. ఫస్టియర్, సెకండియర్లోనూ ప్రైవేట్ కాలేజీలతో పోల్చుకుంటే అట్టడుగు స్థాయి చేరుకున్నాయి. ప్రభుత్వ కాలేజీలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నా ఫలితాలు మాత్రం క్షీణిస్తున్నాయి. ఎంతో అనుభవం గల అధ్యాపకులు ఉన్నా ఫలితాల సాధనలో ఎందుకు పరుగులు పెట్టలేకపోతున్నాయనే ప్రశ్న తలెత్తుతోంది.