వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : ఎమ్మెల్యే

వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : ఎమ్మెల్యే

SRD: మొంథా తుఫాన్ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గురువారం అన్నారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ఉండకూడదని, విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగల దగ్గర జాగ్రత్తగా ఉండాలన్నారు. వాహనాదారులు రోడ్లపై జాగ్రత్తగా వాహనాలు నడిపాలని, గ్రామీణ ప్రాంతాలలో చెరువులు, వాగులు వంటి నీటీ ప్రవాహాల వద్దకు వెళ్లొద్దన్నారు.