కూలీల ఆటో బోల్తా.. ఒకరు మృతి

ప్రకాశం: ముండ్లమూరు మండలం ఉమామహేశ్వరపురం మిర్చి కోతకు వెళుతుండగా కూలీలతో వెళ్తున్న ఆటో ఉల్లగల్లు వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. ఆటోలో వెళ్తున్న దర్శి మండలం లంకోజన పల్లికి చెందిన ఓ మహిళ కూలీ మృతి చెందింది. మరో పదిమంది మహిళా కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108లో దర్శి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.