మామిడి తోటలో పేకాట.. 16 మంది అరెస్టు
ATP: తాడిపత్రి రూరల్ మండలం, హుస్సేనాపురం గ్రామంలోని మామిడి తోటలో గుట్టుగా పేకాట ఆడుతున్న 16 మందిని రూరల్ పోలీసులు దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ₹89,020/- నగదు, మూడు కార్లు, 13 మోటార్ సైకిళ్లు, 11 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు CI శివగంగాధర్ రెడ్డి తెలిపారు.