వరల్డ్ ఛాంపియన్ గుకేశ్‌కు షాక్

వరల్డ్ ఛాంపియన్ గుకేశ్‌కు షాక్

ప్రపంచ ఛాంపియన్ గుకేశ్ మరోసారి తడబడ్డాడు. గోవాలో జరుగుతున్న చెస్ వరల్డ్ కప్‌లో ఎలిమినేట్ అయ్యాడు. మూడో రౌండ్‌లో ఓడి టోర్నీ నుంచి నిష్రమించాడు. పెద్దగా పేరు లేని ఫ్రెడరిక్ స్వాన్ (జర్మనీ) 1.5-0.5తో గుకేశ్‌కు షాకిచ్చాడు. మరోవైపు తెలుగు తేజాలు అర్జున్ ఇరిగేశి, పెంటేల హరికృష్ణ జోరు కొనసాగుతోంది. వీళ్లిద్దరూ నాలుగో రౌండ్‌కు దూసుకెళ్లారు.