'సన్న బియ్యం సరఫరాలో నాణ్యత పాటించాలి'

WNP: జిల్లాలోని అన్ని ప్రభుత్వ సంక్షేమ గురుకుల విద్యాసంస్థలకు సరఫరాచేసే సన్నబియ్యంలో నాణ్యత పాటించాలని అదనపు కలెక్టర్ కిమ్య నాయక్ ఆదేశించారు. గురువారం తన ఛాంబర్‌లో నిర్వహించిన డీసీవోల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నాణ్యతలేని బియ్యాన్ని వెంటనే వెనక్కి పంపించాలని, ఏమైనా సమస్యలు ఉంటే గురుకులాల ఇంఛార్జీలు, డీసీవోలు తన దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు.