భూతగాదాలు.. పినతల్లి, తమ్ముడు మృతి

భూతగాదాలు.. పినతల్లి, తమ్ముడు మృతి

VKB: పరిగి రూప్‌సింగ్ తండాలో విషాదం చోటుచేసుకుంది. ఆస్తి గొడవలతో తండ్రి అనార్ సింగ్ అనే వ్యక్తి మొదటి భార్య కొడుకు కిరాతకానికి ఒడిగట్టాడు. తండ్రి, పినతల్లి, తమ్ముళ్లపై పెట్రోల్ పోసి నిప్పంటించగా చికిత్స పొందుతూ పినతల్లి రమణిబాయి, తమ్ముడు వెంకటేష్ మృతి చెందారు. ఆస్తి ఇవ్వడం లేదన్న కక్షతోనే ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. తండాలో తీవ్ర విషాదం నెలకొంది.