చెన్నకేశవ స్వామి వారికి వెండి వస్తువులు బహుకరణ

చెన్నకేశవ స్వామి వారికి వెండి వస్తువులు బహుకరణ

కోనసీమ: రాజోలు మండలం కడలి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి వారిని బుధవారం కడలి గ్రామానికి చెందిన కాశీభట్ల లక్ష్మీ కన్యాకుమారి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం స్వామివారికి రూ.40 వేలు విలువచేసే 200 గ్రాములు వెండి వస్తువులను బహుకరించారు. ఆలయ ఈవో టి.నాగవిష్ణు ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు స్వామి వారికి వెండి వస్తువులను అలంకరించారు.