ఎన్నికల బరిలో 624 మంది సర్పంచ్, 1,883 వార్డ్ సభ్యులు
నిర్మల్ జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల లెక్క తేలింది. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత సర్పంచ్ స్థానాలకు 624 మంది, వార్డు స్థానాలకు 1,883 మంది బరిలో ఉన్నారు. జిల్లాలోని 136 సర్పంచ్ స్థానాలకు 1,072 వార్డు స్థానాలకు ఈనెల 11న పోలింగ్ నిర్వహించి అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు.