అన్నపూర్ణ అన్న ప్రసాద సేవ కార్యక్రమం

JGL: కోరుట్ల పట్టణంలో సనాతన ధర్మ ప్రచార సమితి ఆధ్వర్యంలో శుక్రవారం "అన్నపూర్ణ అన్నప్రసాద సేవ" కార్యక్రమం నిర్వహించారు. గోపూజ, అన్నపూర్ణ దేవి పూజ అనంతరం జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 1200 మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు. పితృదేవతల సంతృప్తి, సమాజంలో భక్తి భావం పెంపొందించే లక్ష్యంతో ప్రతి అమావాస్యకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.