రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి

రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి

MNCL: మందమర్రి రైల్వే స్టేషన్‌లో రైలు కింద పడి ఇవాళ గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుడి వయస్సు 30 నుంచి 35 ఏళ్లు ఉండగా, మిలటరీ రంగు షర్టు, సిమెంట్ రంగు లోయర్ ధరించినట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ నుంచి పందుర్ణ ప్రయాణపు టికెట్ లభ్యమైనట్లు పేర్కొన్నారు. జీఆర్పీ ఎస్సై మహేందర్ ఆధ్వర్యంలో హెడ్ కానిస్టేబుల్ జస్పాల్ సింగ్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.