'రోడ్డుకు తక్షణ మరమ్మతులు చేపట్టాలి'

'రోడ్డుకు తక్షణ మరమ్మతులు చేపట్టాలి'

NLG: రామగిరి గ్రామం నుంచి మనిమద్దె ఎక్స్ రోడ్డు వరకు రహదారి పూర్తిగా అధ్వానంగా తయారైంది. వర్షాలకు రోడ్డుపై ప్రమాదకరమైన గుంతలు ఏర్పడ్డాయి. గురజాల గ్రామంలో మురుగు నీరు ఉన్న గుంటల్లో పడి పలువురు వాహనదారులు గాయపడుతున్నారు. అధికారులు స్పందించి తక్షణమే రోడ్డుకు మరమ్మతులు చేయాలని స్థానికులు కోరుతున్నారు.