'హైదరాబాద్‌ను యూటీ చేస్తే ఊరుకోం'

'హైదరాబాద్‌ను యూటీ చేస్తే ఊరుకోం'

SRPT: హైదరాబాద్‌ నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతం చేసే కుట్రలను తిప్పికొట్టాలని చండ్ర పుల్లారెడ్డి విజ్ఞాన కేంద్రం రౌండ్‌ టేబుల్ సమావేశం పిలుపునిచ్చింది. తెలంగాణ గుండెకాయపై కేంద్రం పెత్తనం చేస్తే సహించేది లేదని ప్రొఫెసర్ వినాయక రెడ్డి, జే.వీ. చలపతిరావు హెచ్చరించారు. ఈ కుట్రలను ప్రజలు ఐక్యంగా ఎదిరించాలని కోరారు. ఇరాన్‌పై అమెరికా దాడులను నేతలు తీవ్రంగా ఖండించారు.