హనుమాపురంలో తాళం వేసిన ఇంట్లో చోరీ

హనుమాపురంలో తాళం వేసిన ఇంట్లో చోరీ

KRNL: పెద్దకడబూరు మండలం హనుమాపురంలో నిన్న తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. గ్రామానికి చెందిన వీరేశ్ కూలీ పనులకు వెళ్లాడు. ఇంట్లో ఎవరూ లేని విషయాన్ని గమనించిన గుర్తుతెలియని వ్యక్తులు తాళం పగులగొట్టి బీరువాలో ఉన్న బంగారు, వెండి ఆభరణాలు అపహరించారు. ఈ ఘటనపై వీరేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI మారుతి వెల్లడించారు.