'న్యాయవాది వృత్తికి రక్షణ చట్టం తీసుకోస్తా'
W.G: న్యాయవాది వృత్తి రక్షణ చట్టాన్ని తీసుకురావడానికి కృషి చేస్తానని ఏపీ బార్ కౌన్సిల్ సభ్యులు సుంకర రాజేంద్రప్రసాద్ అన్నారు. గురువారం తణుకు బార్ అసోసియేషన్ బార్ అధ్యక్షుడు జి.ఎన్.వి.ఎస్.క్రాంతి ప్రసాద్ అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో న్యాయవాదులపై దాడులు, హత్యలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు.