మధిర మండల GPO అధ్యక్షుడిగా షేక్ బాజీ సైదు

మధిర మండల GPO అధ్యక్షుడిగా షేక్ బాజీ సైదు

KMM: మధిర మండల GPO కమిటీ అధ్యక్షుడిగా షేక్ బాజీ సైదు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు జిల్లా కమిటీ సభ్యులు తెలిపారు. కమిటీ తీర్మాన కాపీని మండల తహసీల్దార్ రాంబాబుకు అందజేసినట్లు చెప్పారు. అటు ఉపాధ్యక్షులుగా ప్రభాకర్ రావు, ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాసరావు, కోశాధికారిగా వెంకట్రావమ్మ, మహిళా అధ్యక్షురాలుగా రంజితతో 8 మంది కమిటీ సభ్యులు ఎన్నికైనట్లు పేర్కొన్నారు.