విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న ఆటో

విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న ఆటో

W.G: మొగల్తూరు మండలం జెట్టిపాలెంలో సోమవారం ఆటో ప్రమాదం జరిగింది. పేరుపాలెం బీచ్ నుంచి వస్తున్న ఆటో విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టడంతో అది విరిగిపోయినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించి, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.