సంతనూతలపాడులో సీఐటీయూ ధర్నా

సంతనూతలపాడులో సీఐటీయూ ధర్నా

ప్రకాశం: సంతనూతలపాడు తహసీల్దార్ కార్యాలయం వద్ద సీఐటీయూ మంగళవారం నిరసన ధర్నా చేపట్టారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి బంక సుబ్బారావు మాట్లాడుతూ.. ఉచిత ఆర్టీసీ బస్సు పథకం ద్వారా ఆటో కార్మికులు నష్టపోతారన్నారు. కాగా, దానికి ప్రత్యామ్నయంగా వారికి ఉపాధి చూపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మిత్ర పథకం క్రింద రూ.25,000లను ఆటో కార్మికులకు ఇవ్వాలన్నారు.