సత్య 'జెట్లీ' డబ్బింగ్ షురూ

సత్య 'జెట్లీ' డబ్బింగ్ షురూ

కమెడియన్ సత్య హీరోగా నటిస్తున్న చిత్రం 'జెట్లీ' డబ్బింగ్ పనులు ప్రారంభమయ్యాయి. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను షేర్ చేస్తూ ప్రకటించింది. డబ్బింగ్ స్టూడియోలో సత్య మైక్ ముందు డైలాగ్స్ చెబుతున్న వీడియో వైరల్ అవుతోంది. ఈ చిత్రానికి రితేష్ రాణా దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా ఓ యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్ అని తెలుస్తోంది.