'సమస్యలు ఉంటే కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇవ్వండి'

NZB: కలెక్టరేట్లో కొనసాగుతున్న కంట్రోల్ రూమ్‌ను కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి శనివారం తనిఖీ చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, వరద ప్రభావిత ప్రాంతాల నుంచి ఏమైనా ఇబ్బందులు ఏర్పడినట్లు సమాచారం అందిన వెంటనే అధికారులను అప్రమత్తం చేయాలని సూచించారు. కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్ 08462 220183కు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు.