బోలెరో వాహనం బోల్తా.. ఒకరి మృతి

బోలెరో వాహనం బోల్తా.. ఒకరి మృతి

W.G: యలమంచిలి మండలం దొడ్డిపట్లకు చెందిన భక్తులు ASR జిల్లాలో ప్రమాదానికి గురయ్యారు. బోలెరోలో 12 మంది గండిపోశమ్మ ఆలయానికి వచ్చి దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో అంగుళూరు ఘాటీ ఎక్కే సమయంలో వాహనం అదుపు తప్పి బోల్తా పడటంతో కె. నరసింహస్వామి (40) అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు గాయపడిన వారిని పోలవరం ఆసుపత్రికి తరలించగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.