VIDEO: లావేరులో 'చదవడం మాకిష్టం' కార్యక్రమం
SKLM: లావేరు శాఖా గ్రంధాలయములో ఇవాళ విద్యార్థులతో 'చదవడం మాకిష్టం' కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రంథాలయాధికారి మురపాక శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ప్రతి ఆదివారం చదవడం మాకిష్టం కార్యక్రమం నిర్వహిస్తున్నామని ప్రతి విద్యార్థి గ్రంథాలయానికి వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రంధాలయ సహాయకులు వీరభద్రుడు, విద్యార్థులు పాల్గొన్నారు.