సంతనూతలపాడులో 94శాతం పెన్షన్లు పంపిణీ: ఎంపీడీఓ

ప్రకాశం: సంతనూతలపాడు మండలంలో మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు 94 శాతం పెన్షన్లు పంపిణీ జరిగిందని ఎంపీడీఓ డి. సురేశ్ తెలిపారు. మండలంలో 6,683 మంది లబ్ధిదారులకు గాను 6,272 మందికి సచివాలయ సిబ్బంది పెన్షన్లు పంపిణీ చేశారని వెల్లడించారు. పంపిణీలో జిల్లాలో మూడో స్థానంలో నిలిచినట్లు వెల్లడించారు.