నేడు మంచినీటి సరఫరాకు అంతరాయం

AKP: ఎలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం పలు ప్రాంతాల్లో మంచినీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని మునిసిపల్ కమిషనర్ ప్రసాదరాజు ఓ ప్రకటనలో తెలిపారు. ఎర్రవరం సంపుకు సరఫరా అయ్యే పైప్ లైన్ పగిలిపోవడంతో మిలటరీ కాలనీ, గాంధీ నగర్, కొత్తపేట, భవనం వీధి, పాత వీధి, దిమిలి రోడ్డు తదితర ప్రాంతాలకు తాగునీటి సరఫరా జలగదని తెలిపారు. ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తామని తెలిపారు.