హైదరాబాద్‌లో దంచికొడుతున్న వాన

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వాన

హైదరాబాద్‌లో మరోసారి భారీగా వర్షం కురుస్తోంది. పంజాగుట్ట, అమీర్ పేట్ యూసఫ్‌గూడ, బంజారాహిల్స్‌, జుబ్లీహిల్స్‌, మాదాపూర్‌, హైటెక్‌ సిటీ, గచ్చిబౌలి, కొండాపూర్‌లో తదితర ప్రాంతాల్లో వాన దంచికొడుతోంది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. మరో వైపు ఆఫీసుల నుంచి ఇంటికి వచ్చే సమయం కావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.