'ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలి'

NRPT: మద్దూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవల స్థితిని రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శి క్రిస్టినా శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని వైద్యులకు సూచించారు. రోగుల అవసరాలను శ్రద్ధగా విని, సమయానికి చికిత్స అందించాలన్నారు. నాణ్యమైన సేవలతోనే ప్రజల్లో మనపై నమ్మకం పెరుగుతుందని స్పష్టం చేశారు.