ఆలయానికి ఇన్వర్టర్ బహుకరణ
గోకవరం మండలం కృష్ణునిపాలెం గ్రామపంచాయతీలో ఉన్న శ్రీ పార్వతి సమేత రాజేశ్వర స్వామి ఆలయానికి గోకవరం వాస్తవ్యులు సీర్ల. సత్యనారాయణ దంపతులు రూ. 20000ల విలువ గల ఇన్వర్టర్‌ను మంగళవారం బహుకరించారు. శివయ్య మా ఆరాధ్య దైవం అని, ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో శివమాల ధరిస్తామని ఆయన తెలిపారు. ఇందులో భాగంగా ఆలయ అర్చకులు, తదితరులు పాల్గొన్నారు.