VIDEO: పుంగనూరులో పర్యటించిన APSCPCR సభ్యులు
CTR: APSCPCR సభ్యులు వెంకట పద్మలత, ఉండవల్లి గాంధీ బాబు శనివారం పుంగనూరులో పర్యటించారు. పట్టణంలోని పలు ప్రభుత్వ విద్యాసంస్థలను సందర్శించారు. విద్యార్థులకు అందుతున్న బోధన, మధ్యాహ్నం భోజనం పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో సరదాగా గడిపారు. విలువలతో కూడిన విద్యాబోధన చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు.