కందకుర్తి వద్ద నీట మునిగిన పురాతన శివాలయం

NZB: ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు రెంజల్ మండలంలోని కందకుర్తి వద్ద గోదావరి నది ఉదృతంగా ప్రవహిస్తోంది. దీంతో పుష్కర ఘాట్ వద్దనున్న పురాతన శివాలయం చుట్టూ వరద నీరు చేరి నీట మునిగింది. మరో మూడు రోజులు ఇలాగే వర్షాలు కురిస్తే ఆలయం పూర్తిగా మునిగిపోయే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు.