పోలీసుల చొరవ..బంగారపు ఉంగరం అప్పగింత

పోలీసుల చొరవ..బంగారపు ఉంగరం అప్పగింత

సూర్యాపేట పట్టణంలో వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో పోగొట్టుకున్న ఎనిమిది గ్రాముల బంగారపు ఉంగరాన్ని పట్టణ సీఐ వెంకట్ బాధితుడికి అప్పగించారు. జేజే నగర్‌కు చెందిన వెంకటేశ్వర్లు ఫిర్యాదుపై స్పందించిన సీఐ, సీసీ కెమెరాల ద్వారా ఉంగరాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు చూపిన చొరవపై బాధితుడు హర్షం వ్యక్తం చేయగా, సిబ్బందిని సీఐ అభినందించారు.