వర్షాలకు కూలిన పెంకిటిల్లు

వర్షాలకు కూలిన పెంకిటిల్లు

ASR: కురుస్తున్న భారీ వర్షాలకు పలు గిరి గ్రామాల్లో గిరిజనులకు భయాందోళన కలిగిస్తున్నాయి. పెదబయలు మండలంలోని గల్లెల గ్రామంలో సుబ్బారావుకు చెందిన పెంకిటిల్లు ఇవాళ ఉదయం కూలిపోయింది. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదన్నారు. నిరాశ్రయులైన తన కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని బాధితుడు కోరుతున్నాడు.