జనగణన, ఇండ్ల గణనను పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

జనగణన, ఇండ్ల గణనను పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

ASF: జిల్లాలో జనగణన, ఇండ్ల గణనను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ హరిత సూచించారు. ఆసిఫాబాద్ కలెక్టరేట్‌లో ఆమె మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో క్షేత్రస్థాయిలో పరిశీలించి హౌస్ లిస్ట్ బ్లాక్‌లు రూపొందించాలని తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి గణన ప్రారంభమవుతుందని, ప్రతి ఎన్యుమరేటర్‌కు 800 మంది జనాభా వచ్చేలా బ్లాక్‌లు ఏర్పాటు చేయాలన్నారు.