పోలకల్లో వైభవంగా చెన్న సోమేశ్వర రథోత్సవం
KRNL: సి. బెళగల్ మండలం పోలకల్ గ్రామంలో స్వయంభువుగా వెలిసిన శ్రీ చెన్న సోమేశ్వర స్వామి రథోత్సవం భక్తుల మధ్య అంగరంగ వైభవంగా మంగళవారం జరిగింది. స్వామిని భక్తితో కొలిస్తే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు.