'ఫ్లైఓవర్‌పై విద్యుత్ దీపాలు ఏర్పాటు వేయండి'

'ఫ్లైఓవర్‌పై విద్యుత్ దీపాలు ఏర్పాటు వేయండి'

కృష్ణా: గుడ్లవల్లేరు ఫ్లైఓవర్‌పై విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాల్సిందిగా ఎంపీడీవో ఇమ్రాన్‌కు వైసీపీ నేతలు కోటప్రోలు నాగు, జాన్ బెన్నీ సోమవారం వినతిపత్రం అందజేశారు. గుడ్లవల్లేరు, కోరాడ, కౌతరం గ్రామాల కేంద్ర బిందువుగా ఫ్లై ఓవర్ ఉంది. ప్రజలు నిరంతరం ప్రయాణించే ఈ ప్రాంతంలో రాత్రి సమయంలో లైట్లు లేకపోవడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు.