భోగాపురంలో కేంద్రమంత్రి రామ్మోహన్ పర్యటన

భోగాపురంలో కేంద్రమంత్రి రామ్మోహన్ పర్యటన

AP: విజయనగరంలోని భోగాపురంలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పర్యటించారు. ఎయిర్‌పోర్ట్ నిర్మాణ పనులను పరిశీలించారు. పనులు శరవేగంగా సాగుతున్నాయని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు 86% పనులు పూర్తి అయ్యాయని చెప్పారు. 2026 జూన్‌లో ఎయిర్‌పోర్ట్ కార్యకలాపాలు ప్రారంభం అవుతాయన్నారు. ఎయిర్‌పోర్ట్‌కు రాకపోకల కోసం 7 ప్రధాన రహదారులు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.