తపస్ మండల కమిటీ ఎన్నిక
MDK: చేగుంట మండల తపస్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా రావుల వెంకటేష్, తంగళ్ళపల్లి కృష్ణమూర్తిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జిడ్డి ఎల్లం, చల్లా లక్ష్మణ్ తెలిపారు. ఉపాధ్యాయ సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామని నూతన అధ్యక్ష కార్యదర్శులు పేర్కొన్నారు. నాయకులు మల్లారెడ్డి, యాదగిరి, దేశపతి కృష్ణమూర్తి పాల్గొన్నారు.