TS పీఆర్టీయూ సభ్యత్వ నమోదు

BHNG: ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం పీఆర్టీయూ టీఎస్ ఆధ్వర్యంలో బీబీనగర్ మండలంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉపాధ్యాయులు తమ పేర్లను సంఘంలో నమోదు చేసుకున్నారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్నామని సంఘ మండల అధ్యక్షులు కోటేశ్వరరావు అన్నారు. సంఘ బాధ్యులు మాధవి, యాదగిరి రెడ్డి, శ్రీలత తదితరులు పాల్గొన్నారు.