రోడ్లపై మొక్కలు నాటి నిరసన

NLG: DVK 11వ వార్డులో వర్షపు నీరు రోడ్లపై నిలిచి బురదమయంగా మారడంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. నిలిచినా నీటిలో ఈగలు దోమలు వాలి సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయని, తమ గోడును అధికారులు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోవడంతో..శనివారం కురిసిన వర్షానికి జలమయమైన రోడ్లపై మొక్కలు నాటి నిరసన తెలిపారు.