రైతులకు కన్నీరు మిగిల్చిన అకాల వర్షం
SRCL: ఆరు నెలలు కష్టపడి పడించిన పంట అకాల వర్షాలతో రైతులకు కన్నీరు మిగిల్చింది. కోనరావుపేట మండలంలోని, మరిమడ్ల గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున రాళ్ళ వాన, వడగండ్ల వాన రైతులను కోలుకోలేని దెబ్బ తీసింది. చేతికొచ్చిన పంట కళ్లముందే రాలిపోతుంటే రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ వర్షాలకు గ్రామంలో దాదాపు 90 % శాతం 200 వందల ఎకరాల పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి.