'మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలి'

'మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలి'

అన్నమయ్య: సుండుపల్లి మండల కేంద్రంలోని ZPHSలో గురువారం కార్తీక వన మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ అధికారులు, ఉపాధ్యాయులు మొక్కలు నాటారు. ఫారెస్ట్ బీట్ అధికారి స్వాతి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని, వృక్షాలు వర్షాలకు కారణమవుతాయని, ఇంటింటా మొక్కలు నాటి భావితరాలకు ఉపయుక్తమైన పర్యావరణాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు.