బంగారం షాపు దగ్ధం.. 'మార్వాడి గో బ్యాక్' పనేనా!

బంగారం షాపు దగ్ధం.. 'మార్వాడి గో బ్యాక్' పనేనా!

KMR: జిల్లాలోని సదాశివనగర్‌లో ఆదివారం సాయంత్రం నిర్మాణంలో ఉన్న ఒక మార్వాడీ బంగారం దుకాణంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కిరోసిన్ పోసి నిప్పంటించడంతో ఫర్నీచర్ దగ్ధమైంది. రాష్ట్రంలో ''మార్వాడి గో బ్యాక్'' ఉద్యమం ఉధృతం అవుతున్న నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కొంతమంది వ్యక్తులను అదుపులోకి తీసుకొని, దర్యాప్తు ప్రారంభించామని ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు.