బనగానపల్లె పట్టణంలో సీపీఐ నాయకులు ర్యాలీ
NDL: బనగానపల్లె పట్టణంలో సీపీఐ ఏఐటీయూసీ నాయకులు ఆదివారం ర్యాలీ నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ప్రైవేట్ రాయల్టీని ఏర్పాటు చేయడంతో గని కార్మికులు పనులు లేక రోడ్డున పడ్డారు. పాత పద్ధతిలోనే రాయల్టీని కొనసాగించాలని సీపీఐ నాయకులు పెట్రోల్ బంక్ సెంటర్‌లో నిరసన చేపట్టారు. లేనిపక్షంలో ఇంకా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.