ప్రభుత్వ వైద్యశాలను సందర్శించిన కలెక్టర్
GNTR: తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలను జిల్లా కలెక్టర్ సాయి కాంత్ వర్మ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మంగళవారం సాయంత్రం తెనాలి వచ్చిన ఆయన ఆసుపత్రిలోని పలు విభాగాలను సందర్శించి చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడారు. ఆసుపత్రిలో అందుతున్న సౌకర్యాలు, వైద్య సేవల గురించి ఆరా తీశారు. సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణిని అడిగి వివరాలు తెలుసుకున్నారు.