'నగరంలో చెరువు కుంటల ఆక్రమణలు'

'నగరంలో చెరువు కుంటల ఆక్రమణలు'

WGL: వరంగల్ గ్రేటర్ పరిధిలో చెరువులు, కుంటలు ఆక్రమణల బారిన పడి కాలనీలుగా మారుతున్నాయి. భద్రకాళి చెరువు FTLలో రామన్నపేట, పోతనగర్, సరస్వతి నగర్, ఎన్టీఆర్ నగర్ తదితర ప్రాంతాలు ఉండగా, చిన్నవడ్డేపల్లి, బంధం చెరువులలో కూడా అనేక కాలనీలు వెలిసాయి. దీంతో వర్షాకాలంలో ముంపు సమస్య తీవ్రంగా మారుతుందని పట్టణ వాసులు వాపోయారు. అధికారులు స్పందించాలని కోరారు.