మద్యం తాగి వాహనాలు నడిపిన వారికి జైలు శిక్ష

మద్యం తాగి వాహనాలు నడిపిన వారికి జైలు శిక్ష

ప్రకాశం: గిద్దలూరులో మద్యం తాగి వాహనాలు నడిపిన ముగ్గురికి న్యాయమూర్తి భరత్ చంద్ర జైలుశిక్ష, జరిమానా విధించారు. మద్యం తాగి ఆటో నడిపిన ఆటో డ్రైవర్కు 10 రోజులు జైలు శిక్ష రూ.10వేలు జరిమానా విధించడంతో పాటు మద్యం తాగి ద్విచక్ర వాహనాలు నడిపిన ఇద్దరికీ 5 రోజులు జైలు శిక్ష రూ.10వేలు జరిమానా విధించారు. మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు