డిసెంబర్ 1 నుంచి డీఎల్ ఈడీ పరీక్షలు
ఉమ్మడి మెదక్ జిల్లాలోని డీఎల్ ఈడీ ప్రథమ సంవత్సరం పరీక్షలు డిసెంబర్ 1 నుంచి 6వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారులు తెలిపారు. ఈ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయని పేర్కొన్నారు. ఛాత్రోపాధ్యాయులు bse.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా తమ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.