గంగారం ఎంపీడీవో గా వైష్ణవి బాధ్యతలు
MHBD: జిల్లా గంగారం మండల ప్రజా పరిషత్ అధికారి ఎంపీడీవోగా డి.వైష్ణవి బాధ్యతలు స్వీకరించారు. గ్రూప్-1 లో సత్తా చాటి మొదటి పోస్టింగ్ లోనే ఎంపీడీవోగా వైష్ణవి నియమితురాలయ్యారు. ఈ క్రమంలో సోమవారం మండల కేంద్రంలోని కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.