20 కేసులను రికవరీ చేసి డిశ్చార్జ్ చేశాం: DMHO

20 కేసులను రికవరీ చేసి డిశ్చార్జ్ చేశాం: DMHO

AP: విజయవాడ డయేరియా ఘటనపై DMHO సుహాసిని స్పందించారు. 'విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో 38 కేసులు ఉన్నాయి. వాంతులు, విరేచనాలతో కొంతమంది అడ్మిట్ అయ్యారు. 20 కేసులను రికవరీ చేసి డిశ్చార్జ్ చేశాం. న్యూరాజరాజేశ్వరిపేటలో 10 బృందాలు సర్వే నిర్వహిస్తున్నాయి. ఆర్ఆర్‌పేటలో ఉన్న కేసులను గుర్తించి వైద్యం అందిస్తున్నాం. 20 తాగునీటి నమూనాలను ల్యాబ్‌కు పంపించాం' అని పేర్కొన్నారు.